గురువారం, 10 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 17 నవంబరు 2022 (19:18 IST)

ఆర్.సి. 15 కోసం రామ్ చరణ్ సిద్ధం అవుతున్నాడు

Ram Charan
Ram Charan
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా సినిమాకు కసరస్తులు చేస్తుంటాడు. ఈసారి ఆర్.సి. 15 కోసం తన దేహాన్ని నెక్స్ట్ లెవెల్లో చూపించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇందుకోసం హైదరాబాద్ శివారులోని ప్రాంతంలో జిమ్ ట్రైనీ తో పలు వ్యాయామాలు చేస్తున్నాడు. జాగింగ్, నడక, బెంచ్ ప్రెస్, పులప్స్, పుషప్స్, స్విమ్మింగ్ వంటి ప్రక్రియలు చేస్తున్న వీడియోను రామ్ చరణ్ విడుదల చేసాడు. ఇది ఇప్పటికే అభిమానులు వైరల్ చేశారు. 
 
తమిళ శంకర్ దర్శకత్యంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ న్యూజిలాండ్ లో జరగనున్నది. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్, మోలీవుడ్, కోలీవుడ్ కు చెందిన నటీ నటులు నటిస్తున్నారు. ఇందులో ఐటెం సాంగ్ కోసం ప్రముఖ హీరోయిన్ నటించనున్నది.