సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 17 నవంబరు 2022 (18:44 IST)

రష్మీ గౌతమ్ గురించి మనసు విప్పిన సుడిగాలి సుధీర్‌

Rashmi Gautham, Sudheer
Rashmi Gautham, Sudheer
ఢీ షో తరువాతే సినిమా అవకాశాలు వచ్చాయి. అక్కడ డ్యాన్సులు, మ్యాజిక్, కామెడీ చేయడంతో సినిమా ఆఫర్లు వచ్చాయి. ట్రై చేద్దామని కొంత మంది వచ్చారు. ఎదుటివాళ్ళు నన్ను నమ్మినప్పుడు.. నాపై నాకు కూడా నమ్మకం ఉండాలి కదా? అని సినిమాలను అంగీకరించాను. అలా అని సినిమాలే కాదు.. బుల్లితెరపై కూడా షోలు చేస్తుంటాను. అని సుడిగాలి సుధీర్‌ అన్నారు. సుడిగాలి సుధీర్‍‍‍‍ హీరోగా న‌టిస్తోన్న మాస్అండ్‌యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `గాలోడు` ఈ చిత్రం నవంబర్ 18న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో సుధీర్ పలు విషయాలుముచ్చటించారు.
 
- ఇమేజ్‌ ఛట్రంలో ఇరుక్కుంటే స్మాల్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్ అని తేడా ఉంటుంది. కానీ నాకు అలా లేదు. మ్యాజిక్ షో చేయమని అడిగారు. చేస్తాను అని అన్నాను. అలానే షోలు అడిగితే కూడా చేస్తాను.
 
- ముందుగా ఈ కథను రష్మీ గౌతమ్ గారికే చెప్పారు. ఆమె డేట్స్ కుదరలేదు. మేం ఇద్దరం కలిసి చేయాలని అనుకుంటున్నాం. మంచి కథ దొరికితే మాత్రం కచ్చితంగా చేస్తాం.
 
- ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. ఉన్నన్నీ రోజులు నవ్వుతూ, నవ్విస్తూ ఉండాలని అనుకుంటాను. అది వెండితెర అయినా, బుల్లితెర అయినా పర్లేదు. అందర్నీ నేను నవ్విస్తూ ఉండాలని భావిస్తాను.
 
- ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అంటే నాకు అంతగా ఇష్టం ఉండదు. రష్మీ గారికి నాకు ఎందుకు అలా కుదిరిందంటే.. మేం ఇద్దరం పట్టుకోం.. ముట్టుకోం. కళ్లతోనే మా భావాలు చెప్పేందుకు ప్రయత్నిస్తుంటాం. ఆన్ స్క్రీన్ మీద రొమాన్స్ మాత్రం వద్దని చెబుతాను. కానీ డైరెక్టర్‌కు నేను చెప్పే పొజిషన్‌లో లేను. ఆ స్థాయికి వచ్చినప్పుడు మాత్రం కచ్చితంగా అలాంటివి వద్దని చెబుతాను.
 
- జబర్దస్త్ స్టేజ్‌ను మిస్ అవుతుంటాను. కానీ నేను ఆ గ్యాప్ అడిగి తీసుకున్నదే. ఆరు నెలలు బ్రేక్ తీసుకుంటాను అని చెప్పా. ఇప్పుడు వచ్చేందుకు రెడీగా ఉన్నాను అని చెప్పారు.