1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 18 నవంబరు 2022 (10:35 IST)

కృష్ణ భౌతిక కాయాన్ని వారి కోసమే ఆపారు, నిన్న చిన్న దినం పూర్తయింది

Mridula, Bharti, Mahesh Babu, Jaya Krishna
Mridula, Bharti, Mahesh Babu, Jaya Krishna
కృష్ణ మరణించాక కృష్ణ ఆఖరి చూపు కోసం కావాల్సిన వారు రావాల్సి ఉంది. అందుకే బాడీని ఒకరోజు ఉంచారు. కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని, కుమార్తె భారతి ఘట్టమనేని ఆస్ట్రియాలో ఉంటున్నారు. చదువుకోసం వెళ్లిన వారు రావడానికి ఆలస్యం అయింది. ఇదిలా ఉండగా, శుక్రవారం నాడు కృష్ణ గారి చిన్న కర్మ జరిపారు. జూబ్లీహిల్స్ లోని ఎఫ్. న్  సి. సి. లో జరిగింది. ముందుగా ప్రార్ధనా సమావేశంలో తన తండ్రి కృష్ణకు నివాళులు అర్పించారు మహేష్ బాబు. అతికొద్ది మంది  హాజరైన ఈ కార్యక్రమంలో రమేష్ బాబు భార్య మృదుల, కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని, కుమార్తె భారతి ఘట్టమనేని నివాళులు అర్పించారు. 
 
mahesh sisters
mahesh sisters
ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్నేహితులు, కుటుంబ సభ్యులు మరియు సహచరులు హాజరయ్యారు,  హాజరైన వారు రమేష్ ఫ్యామిలీని పరామర్శించారు. వారితో మహేష్ బాబు ఫోటోలు దిగారు. ట్విట్టర్‌లో పంచుకున్న ఫోటోలో, మహేష్ తన దివంగత సోదరుడు రమేష్ బాబు కుటుంబంతో కలిసి పోజులిచ్చాడు. సోషల్ మీడియాలో అభిమానులు ఘట్టమనేని కుటుంబానికి తమ ప్రేమను తెలియజేస్తూ, వారికి సానుభూతి తెలియజేస్తున్నారు.