సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 16 నవంబరు 2022 (19:31 IST)

మహేష్ బాబును ఓదార్చిన వై ఎస్ జగన్

jagan, mahesh
jagan, mahesh
ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్ వచ్చారు. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ అంతిమ యాత్ర సందర్భాంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వై ఎస్ జగన్ పద్మాల స్టూడియోకు వచ్చేముందు అరగంట వరకు ఎవరినీ రానీకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. మహేష్ ఇంటికి చేరిన జగన్, మహేష్ కు ధైర్యం చెప్పారు.

jagan, krishna family
jagan, krishna family
అలాగే కృష్ణ గారి పార్థివ దేహానికి అంజలి ఘటించి మహేష్ కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడారు. మహేష్ ను హాగ్ చేసుకుని ఓదార్చారు. ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
 
jagan nivali
jagan nivali
సూపర్ స్టార్ కృష్ణ గారు నాన్నగారికి ఎంత ఆప్తులో జగన్ గుర్తు చేశారు.  వై ఎస్ జగన్ వెంట దిల్ రాజు కూడా ఉన్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు కూడా ఎందరో ప్రముఖులు మహేష్ ని, వారి కుటుంబాన్ని కలిసి అయితే ధైర్యం చెప్పి కృష్ణ గారికి నివాళులు అర్పించారు.