శనివారం, 5 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 24 నవంబరు 2022 (22:36 IST)

నాన్నా... మునుపెన్నడూ లేని కొత్త శక్తి ఇపుడు నాలో కలిగింది (video)

krishna - mahesh
తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మృతిపై ఆయన తనయుడు, సినీ హీరో మహేష్ బాబు స్పందించారు. ఇపుడు తనలో మునుపెన్నడూ లేని కొత్త శక్తి కలిగింది. తనకు భయమే లేదు నాన్నా అంటూ భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేశారు. 
 
తెలుగు చిత్ర పరిశ్రమలో తొలి సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల తుదిశ్వాస విడిచిన విషయం తెల్సిందే. కొన్ని నెలల వ్యవధిలో సోదరుడు రమేష్ బాబు, తల్లి ఇందిరాదేవి, తండ్రి కృష్ణల మరణంతో మహేశ్ బాబు తీవ్ర విషాదంలో కూరుకునిపోయిన విషయం తెల్సిందే. అయితే, తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ ఆయన తాజా సందేశం విడుదల చేస్తూ తన తండ్రిని వేనోళ్ళ కీర్తించారు. 
 
"నాన్నా.. మీ జీవితాన్ని చరితార్థం చేసుకున్నారు. మీ నిష్క్రమణ మహా గొప్పగా సాగింది. అది మీ గొప్పతనం. మీ జీవితాన్ని మీరు నిర్భయంగా జీవించారు. డేరింగ్ అండ్ డాషింగ్ మీ నైజం. నా స్ఫూర్తి. నా గుండె ధైర్యం అన్ని మీతోనే పోయాయని అనుకున్నాను. 
 
 
కానీ, విచిత్రం ఏంటంటే.. మునుపెన్నడూ లేని విధంగా నాలో కొత్త శక్తి కలిగింది. ఇపుడు నాకు భయమే లేదు నాన్నా. మీ దివ్యజ్యోతి నాపై ప్రసురిస్తున్నంత కాలం మీ ఘనతర వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకెళతాను. మీరు మరింత గర్వించేలా చేస్తాను. లవ్యూ నాన్నా. మీరే నాన్న సూపర్ స్టార్" అంటూ తన ప్రకటనలో వివరించారు.