బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 21 నవంబరు 2022 (18:41 IST)

మిహీక గర్భవతి కాదు.. దగ్గుబాటి రానా వెల్లడి

Rana-Mihika
తన భార్య మిహీక గర్భందాల్చినట్టు సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారంపై హీరో దగ్గుబాటి రానా స్పందించారు. తన భార్య గర్భవతి కాదని చెప్పారు. తాము మొదటి బిడ్డకు స్వాగతం పలుకనున్నట్టు సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారంలో రవ్వంత నిజం కూడా లేదని చెప్పారు. 
 
కాగా, రానా దగ్గుబాటి భార్య మిహీక బజాజ్ గర్భవతి అని, రానా తండ్రికాబోతున్నారంటూ ఇటీవల జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఇవన్నీ నిరాధారమైన వార్తలని మిహీక బజాజ్ ఇటీవలే ఖండించారు కూడా. 
 
అయితే, తాజాగా గాయని కనికా కపూర్ కూడా రానా తండ్రి కాబోతున్నారంటూ ఓ ట్వీట్ చేశారు. దీనికి రానా సమాధానమిచ్చారు. తన భార్య మిహీక గర్భవతి కాదని చెప్పారు. మొదటి బిడ్డకు స్వాగతం పలకనున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. 
 
అంతేకాదు, నాకు బిడ్డ పుడితే ఖచ్చితంగా చెబుతాను.. అలాగే, నీకు బిడ్డ పుడితే నువ్వు చెప్పాలి అంటూ కనికా కపూర్‌ను ఉద్దేశించి చమత్కరించారు.