మంగళవారం, 23 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 అక్టోబరు 2022 (12:51 IST)

తండ్రి కాబోతున్న రానా.. దగ్గుబాటి ఇంట డబుల్ ధమాకా!

Rana
Rana
టాలీవుడ్ హీరో, బాహుబలి భల్లాలదేవ త్వరలో తండ్రి కాబోతున్నాడు. హీరోగానూ, విలన్‌గా రాణిస్తూ.. తనదైన పాత్రల్లో కనిస్తున్న రానా.. లీడర్, బాహుబలి, భీమ్లానాయక్ వంటి సినిమాల ద్వారా మంచి హిట్ కొట్టాడు. లేటేస్టుగా రానా సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పాడు. 
 
త్వరలో ఆయన తండ్రి కాబోతున్న విషయం సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. అటు వెంకటేశ్ చిన్న కూతురు కూడా ప్రెగ్నెంట్ కావడంతో దగ్గుబాటి ఇంట్లో దీపావళికి డబుల్ ధమాకా అయినట్లయింది.
 
స్టార్ హీరో విక్టరి వెంకటేశ్ అన్న కొడుకు రానా తనకంటూ సొంత ఇమేజ్ తెచ్చుకున్నాడు. లీడర్‌తో ఎంట్రీ ఇచ్చి.. ఆపై వరుసగా సినిమాలు చేస్తూ వచ్చారు. 'బాహుబలి'లో హీరో ప్రభాస్‌తో సమానంగా రానాకు గుర్తింపు వచ్చింది.  ప్రస్తుతం బాబాయ్ వెంకటేశ్‌తో ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు.
 
ఇక ఆయన పర్సనల్ విషయాలకొస్తే రానా, మిహికాలు ప్రేమించుకున్నారు. వీరు 2020 డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరూ విడిపోతారని ప్రచారం సాగింది. సమంత, చైతూ కపుల్స్ మాదిరిగానే రానా కపుల్స్ విడాకులు తీసుకుంటున్నారని అన్నారు. కానీ ఈ వార్తలకు రానా తాజాగా ఫుల్ స్టాప్ పెట్టాడు. 
 
తాను తండ్రి కాబోతున్నట్లు మిహికాతో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో వారు విడిపోవడం లేదని తేల్చినట్లయింది. ఇక విక్టరి వెంకటేశ్ చిన్న కూతురు కూడా ప్రెగ్నెంట్ అని అంటున్నారు. దీంతో దగ్గుబాటి ఫ్యామిలీ ఇంట్లో ఈ దీపావళికి డబుల్ ధమాకా సంబరాలు చేసుకున్నారని టాక్ వస్తోంది.