గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 8 డిశెంబరు 2022 (09:45 IST)

భార్య పేరుతో రెస్టారెంట్ ప్రారంభించిన హీరో మహేష్ బాబు

mahesh babu restaurant
సూపర్ స్టార్ మహేష్ బాబు తన భార్య నమ్రత శిరోద్కర్ పేరుతో ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలోని ప్రధాన వీఐపీ ఏరియా అయినా బంజారాహిల్స్‌లో తెలంగాణ భవన్ పక్కన ఏఎన్ పేరుతో ఈ రెస్టారెంట్‌ను నెలకొల్పారు. అది గురువారం నుంచి ప్రజలకు అందుబాటులోకిరానుంది. 
 
మహేష్ బాబు ఇప్పటికే సినిమా థియేటర్లు ప్రారంభించారు. తాజాగా ఫుడ్ బిజినెస్‌లోకి కూడా అడుగుపెట్టారు. ఏఎన్ పేరుతో రెస్టారెంట్‌ను ప్రారంభించారు. "ఏ" అంటే ఏషియన్.. "ఎన్" అంటే నమ్రత. అంటే ఆయన భార్య పేరు అని చెబుతున్నారు. ఈ రెస్టారెంట్‌ను పూజాకార్యక్రమాలతో నమ్రత రెస్టారెంట్‌ను ప్రారంభించారు.
 
దీన్ని గ్రాండ్‌గా తీర్చిదిద్దారు. అదేసమయంలో ధరలు కూడా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా జాగ్రత్త పడ్డారు. దుబాయ్‌లో ఉన్న మహేష్ బాబు గురువారం ఈ రెస్టారెంట్‌కు రానున్నట్టు సమాచారం.