శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 5 డిశెంబరు 2022 (18:50 IST)

రవితేజని చూస్తే చాలు పాటలు పుడతాయి : ధమాకా సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో

Bheems Cicerolio
Bheems Cicerolio
మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ధమాకా'. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్  శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. డిసెంబర్ 23న 'ధమాకా' ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదలౌతున్న నేపధ్యంలో చిత్ర సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో విలేఖరుల సమవేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
 
'ధమాకా' మ్యూజిక్ ఇంపాక్ట్ ఎలా వుంటుంది ?
 'ధమాకా' నుండి విడుదలైన ప్రతి పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రతి పాట మిలియన్స్ కొలది వ్యూస్ ని సాధించాయి. ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తుంటే ధమాకాకి ఖచ్చితంగా రీసౌండ్ వస్తుందనే నమ్మకం వుంది.  
 
రవితేజ గారితో బెంగాల్ టైగర్ చేశారు. అది బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు రెండో సినిమా విషయంలో ఒత్తిడి ఫీలయ్యారా ?
ఒత్తిడి లేదండీ. పనిని ఎంజాయ్ చేయడమే నాకు తెలుసు. రవితేజ గారు నాకో రెండోసారి అవకాశం ఇవ్వడం చాలా గర్వంగా ఫీలౌతున్నాను. రవితేజ గారు నాకు గొప్ప నమ్మకాన్ని ఇచ్చారు. వందేళ్ళ తర్వాత కూడా దిన్ని మర్చిపోను. బెంగాల్ టైగర్ కి మించిన ఆల్బమ్ ధమాకా.  
 
రవితేజ గారు మాస్ మహా రాజా కదా.. ఆయనకి మ్యూజిక్ ఇచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ?
రవితేజ గారి కోసం సెపరేట్ గా పాటలు చేయాల్సిన అవసరం లేదు. ఆయన్ని చూస్తే చాలు పాటలు పుడతాయి. ఇది పొగడ్త కోసం చెప్పే మాట కాదు. ఆయన్ని చూసుకుంటూ వచ్చిన విధానం, ఆయన ఎదిగొచ్చిన నేపధ్యం చూస్తే మనకి అర్ధమైపోతుంది. ఆయన మన ఇంట్లో మనిషిలా వుంటారు. మన ఇంట్లో వున్న వ్యక్తి హీరో అయితే ఎలా ఫీలౌతామో ఆయన్ని చూస్తే అదే ఫీలింగ్ వస్తుంది. రవితేజ గారి కటౌట్ చూసినా పాటలు పుడతాయి. పాటలే కాదు .. ఆయన్ని చూస్తే ప్రేమ భక్తి పుడతాయి. నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు రవితేజ గారు. నిజానికి పాటలు చేశానని చెప్పడం కంటే ఈ సినిమాకి రవితేజ గారి పూజ చేశానేమో అనిపిస్తుంది. రవితేజ లాంటి స్టార్ వుండటం మన అదృష్టం.
 
ధమాకా కథ పరంగా మీకు నచ్చిన అంశాలు ఏమిటి ?
ధమాకాలో ఊహించని మలుపులతో సాగే కథనం వుంటుంది. దర్శకుడు త్రినాథరావు నక్కిన సినిమాలు మనం చూశాం. ఆయన మీద మనకి ఒక విశ్వాసం వుంది. ఆ  విశ్వాసాన్ని నిలబెట్టే చిత్రమిది.
 
ఇందులో క్లాసు మాసు రెండు పాత్రలు కాబట్టి ఆల్బమ్ ని కూడా లా డిజైన్ చేసుకున్నారా? రవితేజ గారితో కూడా ఒక పాట హమ్ చేయించినట్లు వున్నారు ?
అవును. రెండు పాత్రలకు తగ్గట్టు పాటలు డిజైన్ చేశాం. కిక్ సినిమాలో ''ఒరేయ్ ఆజామూ.. లగెత్తరో' అని రవితేజ గారు చెప్పిన డైలాగు చాలా పాపులర్. ధమాకాలో పాటలు చేస్తున్నపుడు పాట చివరిలో ఎదో ఒక మెరపు వుండాలనిపించింది.  పాటలో చివర్లో ''ఓ సిసిరోలియో ఏరా అప్పుడే ఆపేశావ్ ఇంకోసారి దరువేసుకో'' అనే  డైలాగ్ ని మొదట డైరెక్టర్ గారి తో అనిపించాను. ఇది రవితేజ గారితో అనిపించాలి. ఆయన్ని ఎదో రకంగా ఒప్పించాము. ఆయన అంత బిజీ షెడ్యుల్ లో కూడా స్టూడియో కి వచ్చి అది పాడారు.
 
రవితేజ గారికి ఈ కథ ఎంత యాప్ట్ అనిపించింది ?
ధమాకా లో వింటేజ్ రవితేజ గారు కనిపిస్తారు. దాని ప్రకారం మీరే ఊహించుకోవచ్చు.
 
ధమాకా లో ఎన్ని పాటలు వున్నాయి  ?
ధమాకా లో మొత్తం ఐదు పాటలు వున్నాయి. ఇప్పటి వరకు విడుదలైన జింతాక్, వాట్స్ హ్యాపెనింగ్, మాస్ రాజా, డుడు.. పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మరో పాట వుంది. అది నేనే రాసి పాడాను.
 
ఇందులో కష్టం అనిపించిన పాట ఏది ?
నేను పెద్ద కష్టం ఫీలవ్వను. ఒకొక్కసారి రెండు మూడు గంటల్లో కూడా పాట అయిపోతుంది. పాట నా స్నేహితుడు, తల్లి. బిడ్డకు ఏం కావాలో తల్లికి తెలియదా ? పాట నా వెన్నంటే ఉండే స్నేహితుడు.
 
మీలో రచయిత కూడా వున్నారా ?
అవునండీ. రచయితగానే ప్రయాణం మొదలుపెట్టాను. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రస్థానం మొదలైయింది. పాటలు కూడా పాడుతాను. 'ముంబై పోతావా' పాట పాడింది నేనే. అయితే దాన్ని ఎవరూ గుర్తించలేదు. (నవ్వుతూ) అయితే జింతాక్ పాట తో గుర్తింపు వచ్చింది. భీమ్స్ పాటలు కూడా బాగా పాడుతున్ననాడని అంటున్నారు.
 
మీ పేరు వినగానే అన్నీ మాస్ పాటలు గుర్తుకు వస్తాయి. మెలోడి మిస్ అవుతున్న ఫీలింగ్ ఏమైనా వుంది ?
భీమ్స్ సిసిరోలియో అంటే మాస్ మెలోడి అనే తేడా లేదు. నాది ఒకే ఒక్క జోనర్ ..జనం జోనర్. జనం ఇష్టపడే అన్ని రకాల పాటలు చేస్తాను.
 
కొత్త చేయబోతున్న సినిమాలు ?
కెరీర్ లో కొంత గ్యాప్ వచ్చిన మాట వాస్తవమే. అయితే ఈ గ్యాప్ ని ఫుల్ ఫిల్ చేసే విధంగా ఒక పదిహేను సినిమాలు చేస్తున్నాను. ధమాకా 23న వస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లోగ మరో పది సినిమాలు వస్తాయి.