మంగళవారం, 12 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : గురువారం, 8 డిశెంబరు 2022 (09:15 IST)

కోర్కె తీర్చాలంటూ తెలుగు టీవీ యాంకర్‌ను వేధింపులు... ఎక్కడ?

woman victim
హైదరాబాద్ నగరంలో అమ్మాయిలపై వేధింపులు నానాటికీ పెరిగిపోతున్నాయి. తెలిసి యువకులే అమ్మాయిలను వేధిస్తున్నారు. తాజాగా ఓ తెలుగు టీవీ యాంకర్‌ను ఓ 30 యేళ్ళ వ్యక్తి వేధించాడు. తన కోర్కె తీర్చాలంటూ వెంటపడ్డాడు. అతని వేధింపులు భరించలేని ఆ యాంకర్ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన  పోలీసులు.. పోకిరిని కటకటాల వెనక్కి పంపించారు. 
 
హైదరాబాద్ మధురానగర్‌కు చెందిన ఓ యువతి (27) హాస్టల్‌లో ఉంటూ ఓ టీవీ చానెల్‌లో యాంకర్‌గా పని చేస్తుంది. కాలేజీ చదువుకునే రోజుల్లో సహ విద్యార్థి అయిన కూకట్‌పల్లికి చెందిన కె.సామ్రాట్ (30) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో ప్రేమించుకుంటే ఫర్లేదు.. స్నేహితుల్లా ఉందాంటూ ఆమెను నమ్మించాడు. 
 
ఈ క్రమంలో ఓసారి కారులో యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించగా, ఆమె చాకచక్యంగా తప్పించుకుంది. దీంత ఆమెపై కక్షగటిన సామ్రాట్.. ఆమె ఫోటోలను నగ్న చిత్రాలను మార్ఫింగ్ చేసి వేధించడం మొదలుపెట్టాడు. తన కోరిక తీర్చకుంటే ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ బెదిరించసాగడంతో ఆ వేధింపులు భరించలేక ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ యువకుడిని అరెస్టు చేశారు.