గురువారం, 23 మార్చి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified బుధవారం, 30 నవంబరు 2022 (20:51 IST)

ప్రేయసిపై అనుమానం, గొంతు పట్టుకుని తలను గోడకేసి కొట్టి చంపేసాడు

couple
అనుమానం ఓ యువతి ప్రాణాలను బలిగొంది. బెంగళూరులో ప్రేమికుల మధ్య జరిగిన వాగ్వాదం ప్రేయసి ప్రాణాలు తీసింది. నేపాల్‌కు చెందిన 23 సంవత్సరాల క్రిష్ణ కుమారి అనే యువతి, 27 ఏళ్ల సంతోష్ ధామి ఇరువురు ప్రేమికులు. బ్యూటీషియన్ అయిన కృష్ణకుమారి హోరామావులోని  స్పాలో పనిచేస్తోంది.

 
సంతోష్ ధామి టీసీ పాళ్యలోని బార్బర్ షాపులో పనిచేస్తున్నాడు. వీరివురు మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో రెండేళ్ల నుంచి ఒకే ఇంటిని అద్దెకు తీసుకుని కలసి జీవిస్తున్నారు. గత రాత్రి ఇరువురి మధ్య వివాదం చెలరేగింది.

 
మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానిస్తూ సంతోష్ ప్రియురాలితో గొడవ పడ్డాడు. కృష్ణకుమారి తీవ్రంగా ప్రతిఘటించడంతో కోపోద్రిక్తుడైన సంతోష్... ఆమె మెడ పట్టుకుని తలను గోడకేసి కొట్టి అతి దారుణంగా హత్య చేశాడు. నిందితుడుని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.