ఢిల్లీలో దారుణం - ఒకే ఫ్యామిలీలో నలుగురి దారుణ హత్య
ఢిల్లీలో మరో దారుణం జరిగింది. ఒకే ఫ్యామిలిలో నలుగురు కుటుంబ సభ్యులను ఓ యువకుడు దారుణంగా హత్య చేశాడు. బుధవారం తెల్లవారుజామున ఈ దారుణం జరిగింది. ఢిల్లీలోని పాలమ్ ఏరియాకు చెందిన ఓ యువకుడు తన తండ్రి, ఇద్దరు సోదరీమణులు, నానమ్మను హ్తయ విచక్షణారహితంగా కొట్టి చంపేశాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
ప్రాణాలు కోల్పోయిన వారిలో ముగ్గురు మహిళల్లో ఒక మహిళ శవం గ్రౌండ్‌ఫ్లోర్‌లో పడివుండగా, మరో రెండు మృతదేహాలను బాత్‌రూమ్‌లో గుర్తించామని పోలీసులు వెల్లడించారు. నిందితుడు మత్తుపదార్థాలకు బానిసై ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ హత్యలకు సంబంధించి కారణాలు తెలియాల్సివుంది.