గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 నవంబరు 2022 (16:51 IST)

ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌కు మసాజ్ చేసింది ఎవరు..?

Minister
Minister
మనీలాండింగ్ కేసులో తీహార్ జైలులో వున్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ మసాజ్ వ్యవహారం మరో మలుపు తీసుకుంది. మంత్రికి మసాజ్‌ చేసింది ఫిజియోథెరపిస్ట్‌ కాదని.. పోక్సో యాక్ట్‌ కింద శిక్ష అనుభవిస్తున్న నిందితుడు రింకూ అని తీహార్‌ జైలు అధికార వర్గాల సమాచారం. 
 
రింకూ లైంగిక దాడి కేసులో నిందితుడని, పోక్సో చట్టంలోని సెక్షన్ 6, ఐపీసీ 376, 506, 509 కింద అభియోగాలు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. మరోవైపు సత్యేందర్‌ జైన్‌కు మసాజ్‌ చేసింది రేపిస్ట్‌ అని బీజేపీ నేత షాజాద్‌ పూనావాలా ట్వీట్‌ చేశారు.