మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 నవంబరు 2022 (10:04 IST)

సింగర్ మంగ్లీకి అరుదైన గౌరవం.. ఎస్వీబీసీ సలహాదారుగా బాధ్యతలు

Mangli
జానపద గాయని సింగర్ మంగ్లీ శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ అడ్వైజర్‌గా ఆమె అపాయింట్‌ అయ్యారు. తద్వారా సింగర్ మంగ్లీకి అరుదైన గౌరవం దక్కింది. రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. పర్యాటక శాఖ మంత్రి కే రోజా పుట్టినరోజు సందర్భంగా ఆమెను కలిశారు మంగ్లీ. ఎస్వీబీసీ సలహాదారు హోదాలోనే మర్యాదపూర్వకంగా కలిశారని చెప్తున్నారు. లంబాడి సామాజిక వర్గానికి చెందిన మంగ్లీ అసలు పేరు సత్యవతి రాథోడ్. 
 
తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి కర్ణాటక మ్యూజిక్‌లో డిప్లొమా పూర్తి చేశారు. అనంతరం యాంకర్‌గా తన కెరీర్‌ను ఆరంభించారు. 
 
మ్యూజిక్‌పై ఆసక్తి ఉండటంతో సింగర్‌గా మారారు. జానపద గాయనిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తొలుత ప్రైవేట్ ఆల్బమ్స్‌ చేశారు. అవన్నీ ఆమెకు మంచి పేరును తీసుకొచ్చాయి. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఆల్బమ్స్‌ను రూపొందించారు. తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే బతుకమ్మపై మంగ్లీ చేసిన మ్యూజిక్ ఆల్బమ్స్ ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. 
 
ఆ ఆల్బమ్స్ హిట్ కావడంతో ఆమెతు సినిమాల్లో పాడే అవకాశాలు వెల్లువల్లా వచ్చాయి. తాజాగా- ఎస్వీబీసీ సలహాదారుగా నియమితులు కావడం మంగ్లీ కేరీర్‌లో మరో మలుపు. రాజకీయంగా కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది మేలు కలుగజేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.