1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Singer Sunitha's son to make his acting debut

కుమారుడు ఆకాష్‌ను హీరో చేస్తోన్న సునీత (Video)

Singer Sunitha
సింగర్ సునీత గాయనిగా మంచి పేరు సంపాదించింది. ఈమె అందం, గాత్రంతో చాలామంది సినీ ప్రేక్షకులను ఫిదా చేసింది. సినిమాల్లో నటించే అవకాశం వచ్చినా అబ్బే వద్దులేండి అంటూ సున్నితంగా తిరస్కరించింది. తన భర్త, సంతానంతో హ్యాపీగా గడుపుతోంది. 
 
సింగర్, డబ్బింగ్ ఆర్టిస్టుగా బిజీగా వున్నా.. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తోంది. అమ్మాయిని బాగా చదివిస్తోంది. నాసాలో ఆమెను శాస్త్రవేత్తను చేసేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. మరోవైపు తన కుమారుడిని సినిమా రంగంలోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. 
 
కుమారుడు ఆకాశ్‌ను హీరోగా తెచ్చే వ్యవహారంలో ఆమె క్లారిటీ ఇచ్చారు. ఆకాశ్‌ను హీరోగా చేయబోతున్నట్లు ప్రకటించారు. తన కుమారుడు వెండితెరపై కనిపిస్తాడని.. అందరూ ఆకాష్‌ను ఆశీర్వదించాలని కోరారు. అయితే ఈ ఏ సినిమాలో ఆకాష్ కనిపిస్తాడు. దర్శకుడు, పతాకంపై ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలో ఆ వివరాలు వెల్లడి కానున్నాయి. 

 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
చైతన్యం కలిగించే యశోద, మూవీ రివ్యూ రిపోర్ట్