ఆదివారం, 10 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 8 నవంబరు 2022 (15:15 IST)

మద్యం మత్తులో కన్న కుమారుడిని హత్య చేసిన తండ్రి

murderer
పీకల వరకు మద్యం సేవించిన తాగుబోతు తండ్రి ఒకరు మద్యం మత్తులో కన్నబిడ్డనే కత్తితో పొడిచి చంపేశాడు. ఈ దారుణం హైదరాబాద్ నగరంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నేరేడ్మెట్ జేజే నగర్, ఎస్ఎస్‌బి క్లాసిక్ అపార్టుమెంట్‌లో వాచ్‌మెన్‌గా సుధాకర్ ఉండగా, ఈయనకు భార్య దివ్య, రెండేళ్ల కుమారుడు జీవన్ ఉన్నారు. సుధాకర్ రెండు రోజుల క్రితం మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో కుమారుడు ఏడుస్తుండటంతో బుజ్జగించాడు. 
 
అయినప్పటికీ ఏడుపు మానకపోవడంతో కోపంతో గట్టిగా కొట్టాడు. దీంతో జీవన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో భయాందోళన చెందిన తల్లి నేరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు వచ్చి జీవన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి సుధాకర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.