సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 8 నవంబరు 2022 (13:16 IST)

ఆస్తి వివాదం.. వైకాప నేత దారుణం.. మట్టి పోసి సజీవంగా పాతిపెట్టే సాహసం

property-dispute
ఆస్తి వివాదంలో కుటుంబ సభ్యులో ఓ మహిళను సజీవ సమాధి చేసేందుకు ప్రయత్నించారు. ఆ మహిళపై మట్టి కంకర పోసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ దారుణానికి పాల్పడింది కూడా వైకాపా నేతలే కావడం గమనార్హం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కుటుంబ ఉమ్మడి ఆస్తిలో తమకు న్యాయంగా రావాల్సిన వాటా ఇవ్వాలంటూ గ్రామానికి చెందిన కొట్ర దాలమ్మ, ఆమె కుమార్తె మజ్జి సావిత్ర 2019 నుంచి పోరాడుతున్నారు. మరోవైపు, స్థానిక హెచ్.బి. కాలనీ సమీపంలో రహదారి పక్కన ఉమ్మడి ఆస్తిగా ఇంటి స్థలంలో నిర్మాణం కోసం దాలమ్మ భర్త నారాయణ అన్న కుమారుడు కొట్ర రామారావు ట్రాక్టరుతో కంకరమట్ట తోలిస్తున్నారు. ఈ స్థలంలో తమకు కూడా వాటా ఉందని చెబుతూ దాలమ్మ సావిత్ర అక్కడికి వెళ్ళారు. 
 
మట్టి ఎలా తోలుతారని రామారావుతో వాగ్వివాదానికి దిగారు. పట్టి పోయడానికి వీల్లేదంటూ ట్రాక్టర్ వెనుకవైపున కూర్చున్నారు. అయినా పట్టించుకోని రామారావు, వారిపైనే ట్రాక్టర్ మట్టిని పోయడంతో తల్లీకుమార్తెలు అందులో కూరుకునిపోయారు. ఈ హఠాత్‌ పరిణామానికి విస్తుపోయిన వారు తమను కాపాడాలంటూ కేకలు వేశారు. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని కంకర మట్టి తొలగించి వారిని రక్షించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న మందస పోలీసులు కొట్ర రామారావుపై కేసు నమోదు చేశారు.