గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 31 అక్టోబరు 2022 (20:10 IST)

సినిమాల్లో నటిస్తానో లేదో.. రాజకీయాల్లోకి వస్తాను.. నమిత

అందాల సుందరి నమిత త్వరలో రాజకీయాల్లోకి రానుంది. సినిమాల్లో అందాలను ఆరబోసిన నమిత.. ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్‌ను హ్యాపీగా గడుపుతోంది. ఇటీవలే నమితకి కవల పిల్లలు పుట్టారు. తాజాగా నమిత తిరుమల శ్రీవారిని దర్శించుకోడానికి వచ్చింది. 
 
ఈ సందర్భంగా నమిత మాట్లాడుతూ.. కుటుంబంతో పాటు స్వామిని దర్శించుకున్నామని తెలిపింది. సినిమాలు చేస్తానో చేయనో చెప్పలేను. కానీ సినిమాల మీద కంటే పాలిటిక్స్ మీద ఎక్కువ ఆసక్తి ఉంది. 
 
త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని చెప్పింది. దీంతో నమిత చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో చర్చగా మారాయి. నమిత ఏ పార్టీలో చేరుతుందోననే చర్చ సాగుతోంది.