1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated: గురువారం, 27 అక్టోబరు 2022 (17:43 IST)

జూనియర్ ఎన్టీఆర్‌ సరసన నటించేందుకు సిద్ధం : జాన్వీ కపూర్

jhanvi kapoor
టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించేందుకు తాను సిద్ధమేనని బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ స్పష్టం చేశారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, సౌత్ సినిమాలను తాను చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఈ మధ్య కాలంలో వచ్చిన "ఆర్ఆర్ఆర్" తనకు బాగా నచ్చిందని చెప్పారు. ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ అదరగొట్టేశారని కితాబిచ్చారు. 
 
ఇక టాలీవుడ్ హీరోలు ప్రభాస్, మహేష్‌, బన్నీ ఇలా ప్రతి ఒక్కరి యాక్టింగ్ తనకు నచ్చుతుందని తెలిపారు. అయితే, ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం వస్తే మాత్రం తాను వదులుకోనని చెప్పారు. 
 
ఇదిలావుంటే, జాన్వీ కపూర్ బాలీవుడ్ నటిగా కంటే అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి కుమార్తెగానే తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితం. అందుకే ఆమెను తెలుగు వెండితెరకి పరిచయం చేయడానికి టాలీవుడ్ మేకర్స్ ముమ్మరంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఇప్పటివరకు ఆమెను ఏ ఒక్క నిర్మాత ఒప్పించలేకపోతున్నారు.