ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 అక్టోబరు 2022 (14:20 IST)

ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ఆశలు సజీవం.. ఏకంగా 15 అవార్డుల కోసం..?

RRR
RRR
ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ ఆశలను సజీవం చేసుకుంది. ఆర్ఆర్ఆర్ విడుద‌లై ఏడు నెల‌లు దాటినా ఈ సినిమా హ‌వా మాత్రం ఇంకా త‌గ్గ‌లేదు. దేశ‌వ్యాప్తంగా 1200 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి స‌త్తా చాటింది. RRR సినిమా ఆస్కార్ అవార్డుల బ‌రిలోకి నిలుస్తుంద‌ని ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్ష‌కులు కూడా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూశారు. అయితే ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా అంద‌రికీ షాకిచ్చింది. గుజ‌రాతీ మూవీ చెల్లో షోను ఆస్కార్ బ‌రిలోకి దింపింది. 
 
కానీ అమెరికా ఈ సినిమాను గుర్తించింది. యు.ఎస్‌లో ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన సంస్థ ఆస్కార్ అవార్డుల‌కు ఆర్ఆర్ఆర్‌ను పంప‌డానికి గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తుంది. ఫ‌ర్ యువ‌ర్ క‌న్‌సిడ‌రేష‌న్ (FYC) కింద ప్ర‌జ‌ల్లోకి సినిమాను తీసుకెళుతుంది. స్పెష‌ల్ స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేసింది. దీనికి ఆడియెన్స్ పెద్ద సంఖ్య‌లో హాజ‌ర‌వుతున్నారు. సినిమాను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. 
 
FYC క్యాంపెయిన్‌లో భాగంగా RRRను ప‌లు విభాగాల‌కు ఇండిపెండెంట్‌గా పంప‌డానికి గ‌ట్టి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. బెస్ట్ డైరెక్ట‌ర్‌, బెస్ట్ యాక్ట‌ర్‌, బెస్ట్ స‌పోర్టింగ్ యాక్ట‌ర్‌, బెస్ట్ సినిమాటోగ్ర‌ఫీ, బెస్ట్ ఒరిజిన‌ల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్‌, బెస్ట్ ఒరిజిన‌ల్ స్కోర్ కేట‌గిరీల్లో .. ఏకంగా 15 అవార్డుల కోసం RRRను ఆస్కార్ బ‌రిలోకి పంప‌డానికి పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ చేస్తున్నారు. 
 
తాజాగా కేటగిరీలు ఇవే:
* బెస్ట్ మోషన్ పిక్చర్
* బెస్ట్ డైరెక్టర్ - రాజమౌళి
* బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే
* బెస్ట్ యాక్టర్ :  జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్
* బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ : సాబు సిరిల్
* బెస్ట్ ఒరిజినల్ స్కోర్ : ఎంఎం కీరవాణి
* బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ : రమా రాజమౌళి
* బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్
* బెస్ట్ మేకప్, హెయిర్ స్టైలింగ్ : నల్ల శ్రీను, సేనాపతి నాయుడు
* బెస్ట్ సౌండ్ : (రఘునాథ్ కామిశెట్టి, బోలోయ్ కుమార్ డోలోయి, రాహుల్ కార్పే) 
* బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ : వి. శ్రీనివాస్ మోహన్.
* బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ : అజయ్ దేవగణ్ 
* బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్: అలియా భట్
* బెస్ట్ సినిమాటోగ్రఫీ : కేకే సెంథిల్ కుమార్
* బెస్ట్ ఒరిజినల్ సాంగ్ : నాటు నాటు