ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 సెప్టెంబరు 2022 (11:29 IST)

ఆస్కార్ బరిలో "ఆర్ఆర్ఆర్" - టాప్-8లో చోటు

rrrforoscars
టాలీవుడ్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం "ఆర్ఆర్ఆర్". ఈ చిత్రం ఆస్కార్‌ బరిలో పోటీపడుతోంది. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన తర్వాత కలెక్షన్ల పరంగా అనేక రికార్డులను నెలకొల్పిన విషయం తెల్సిందే. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత కూడా ఓటీటీలో తన సత్తా చాటుతోంది.
 
ఓటీటీలో విడుదలైన తర్వాత హాలీవుడ్ ప్రేక్షలను కూడా ఫిదా చేస్తుంది. గత ఐదు వారాలుగా ట్రెండింగ్‌లోనే కొనసాగుతోంది. పైగా, హాలీవుడ్ టెక్నీషియన్లు ఈ చిత్రం గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో 95వ ఆస్కార్ ప్రదానోత్సవ కార్యక్రమంలో వచ్చే యేడాది మార్చి నెలలో జరుగనుంది. 
 
ఇందుకోసం చిత్రాలను ఎంపిక చేస్తున్నారు. వీటిలో "ఆర్ఆర్ఆర్" కూడా పోటీపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వరకు ఎంపిక చేసిన టాప్ 8 చిత్రాల్లో "ఆర్ఆర్ఆర్" ఆరో స్థానంలో ఉంది. భారతీయ చిత్రపరిశ్రమ నుంచి ఈ ఒక్క చిత్రమే పోటీలో ఉంది.