సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 19 సెప్టెంబరు 2022 (10:26 IST)

టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో నటిస్తున్నాను.. థ్యాంక్స్... రేణు దేశాయ్

Renu Desai
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భారీ రేణు దేశాయ్ బుల్లితెరపై ఒక షోకు జడ్జిగా వ్యవహరించి మెప్పించింది. తాజాగా రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కీలక పాత్ర పోషిస్తుందని ఎప్పటి నుంచో వార్తలు గుప్పుమంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయేసరికి నిజమో కాదో అని అభిమానులందరూ డైలమాలో పడ్డారు. 
 
కాగా, ఎట్టకేలకు ఈ వార్తను నిజం చేస్తూ రేణు అధికారికంగా ఈ విషయాన్నీ ప్రకటించింది. స్టూవర్టుపురం గజ దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథగా తెరకెక్కుతున్న చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు'.
 
వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రవితేజ సరసన నుపుర్‌ సనన్‌, గాయత్రీ భరద్వాజ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో తాను భాగమైనందుకు సంతోషంగా ఉందని రేణు తెలిపింది.
 
'హేమలత లవణం గారి లాంటి స్పూర్తిదాయకమైన పాత్రలో నేను చేయగలను అని నన్ను నమ్మిన దర్శకుడు వంశీ కృష్ణకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడంలేదని' చెప్పుకొచ్చింది.