యూ టర్న్ తీసుకున్న అనుష్క?
వెండితెర నాయిక అనుష్క శెట్టి గతకొంతకాలంగా సోషల్‌మీడియా ఇన్‌స్ట్రానుంచి తప్పుకుని స్వదేశానికి చెందిన కొత్త యాప్‌లో ప్రవేశించింది. కానీ దాన్నుంచి పెద్దగా స్పందన రాకపోవడంతో కొద్దికాలం ఆమె గురించి వివరాలు ఏమీ తెలియనివ్వలేదు. ప్రభాస్, అనుష్క విషయంలో రకరకాలుగా వార్తలు రావడంతోపాటు ఆమె నిదానంగా సినిమాలు తగ్గించుకుని ఒక్కసారిగా కనిపించకుండాపోయింది.
అయితే తాజాగా ఆదివారం నుంచి ఇన్‌స్ట్రాలో మరలా ఫొటోలు పోస్ట్ చేసింది. కృష్ణంరాజుగారు మరణించడంతో రెస్ ఇన్ పీస్ కృష్ణంరాజుగారు. మీరు మా హృదయంలో చెరగని ముద్రవేశారు. మా హృదయంలో జీవించే వున్నారు.. అంటూ ఇన్‌స్ట్రాలో పోస్ట్ చేసింది. ఇదే ఆరంభంగా ఈరోజు కూడా పలు పాత ఫొటోలను పెట్టి అభిమానులకు మరలా తాను మీతో షేర్ చేసుకుంటాననేలా హింట్ ఇచ్చింది. ఇటీవల కృష్ణంరాజు మరణం తర్వాత ప్రభాస్‌ను కలిసి ఓదార్చిన అనుష్క ఇలా షడెన్‌గా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండడంతో అంతర్యం ఏదో వుందంటూ నెటిజన్టుల ఆశ్చర్యపోతున్నారు.