వైజాగ్‌లో కంచర్ల షూటింగ్ ప్రారంభం
Upendra, Meenakshi Jaiswa, Praneetha
అనంతరం చిత్ర సమర్పకులు కె. అచ్యుతరావు మాట్లాడుతూ...సినీ ప్రేక్షకులకు వినూత్న కథాంశంతో కూడిన చిత్రాన్ని అందించేందుకు కంచర్ల చిత్రం రూపొందిస్తున్నామన్నారు. ఈ చిత్రం అన్ని వర్గాల, అన్ని వయసుల వారిని ఆకట్టుకుంటుందన్న నమ్మకంతో ఉన్నాం. ఉపేంద్ర హీరోగా నటిస్తున్న కంచర్ల చిత్రాన్ని ప్రేక్షకులు ఆశీర్వాదించాలని కోరుకుంటున్నాను అన్నారు.
దర్శకులు రెడ్డెం యాద కుమార్ మాట్లాడుతూ .. యువకులు రాజకీయాల్లోకి రావాలి. సేవా దృక్పథంతో ఉండాలి అనే కాన్సెప్ట్ తో లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. తొలి షెడ్యూల్ ప్రారంభించాం. విశాఖ ప్రాంతంలోనే మొదటి షెడ్యూల్‌కు సంబంధించిన షూటింగ్ జరుపుతాము. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తాం. ` అన్నారు.
హీరో ఉపేంద్ర, హీరోయిన్ మీనాక్షి జైస్వాల్ మాట్లాడుతూ...కంచర్ల చిత్రం తమ నటనా జీవితానికి మలుపు రాయిగా నిలుస్తుంది అన్నారు. కార్యక్రమంలో సినీ నటుడు బాహుబలి ప్రభాకర్, డీఓపీ గుణశేఖర్, క్యాలు జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

