గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 5 జులై 2022 (16:56 IST)

గవి సినిమాస్ & సిల్లీ మాంక్స్ స్టూడియోస్ చిత్రం ప్రారంభం

vignesh reddy, arshita, MLA Nomula Bharath, MLA Kancharla Bhupal Reddy, Municipal chairman M. Saidi reddy
vignesh reddy, arshita, MLA Nomula Bharath, MLA Kancharla Bhupal Reddy, Municipal chairman M. Saidi reddy
గవి సినిమాస్ & సిల్లీ మాంక్స్ స్టూడియోస్ బేన‌ర్‌పై నూతనంగా నిర్మిస్తున్న చిత్రాన్ని తెలంగాణలోని నల్గొండ జిల్లా, చిన్నమాదారం గ్రామంలో ప్రారంబించారు. నల్గొండ ఎమ్మెల్యే శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి & నాగార్జున సాగర్ ఎమ్మెల్యే శ్రీ నోముల భగత్ తో పాటు నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందాడి సైదిరెడ్డి ఈరోజు ప్రారంభమైన షూటింగ్ మహోత్సవానికి హాజరయ్యారు.
 
ఈ చిత్రానికి RG గండికోట దర్శకత్వం వహిస్తుండగా, సంగీతం చరణ్ అర్జున్ మరియు  ప్రవీణ్ కె బంగారి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో విఘ్నేష్ రెడ్డి మరియు శ్రీ హర్షితలు హీరో, హీరొయిన్లుగా పరిచయం  అవుతున్నారు. కోకొండ జయచందర్ రెడ్డి, సంజయ్ రెడ్డి మరియు అనిల్ పల్లాల  నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నవంబర్ 2022 నెలలో విడుదల చేసేందుకు తాత్కాలికంగా ప్లాన్ చేస్తున్నారు.
సంజయ్ రెడ్డి  & అనిల్ పల్లాల మాట్లాడుతూ, ప్రతి కథ ఎంపిక ప్రత్యేకమైనదని మరియు నేటి ప్రేక్షకులకు అనుగుణంగా ఉంటూ పాజిటివ్ ఆలోచనలని ప్రేరేపించే అంశాలు ఉంటాయని తెలిపారు
 
సిల్లీ మాంక్స్ స్టూడియోస్ లిమిటెడ్ సౌత్ఇండియా అంతటా భారీ సినిమా మరియు సిరీస్ ల లైన్ అప్ కలిగి ఉంది. కంపెనీ ఉద్దేశం కొత్త కథలను ప్రోత్సహించడం,అభివృద్ధి చేయడం, సినిమా మరియు సిరీస్ ప్రాజెక్ట్ లను సెటప్ చేయడం,పెట్టుబడిదారులు మరియు సినిమా సృష్టికర్త మధ్య వారధిగా పని చేయడం మరియు సినిమా వ్యాపారాన్ని లాభదాయకంగా మార్చడం. 9 సంవత్సరాలకు పైగా ట్రాక్ రికార్డు కలిగి వుండి స్క్రిప్ట్ డెవలప్‌మెంట్,మార్కెటింగ్ మరియు సినిమా మార్కెటింగ్, ప్రొడక్షన్ మరియు విక్రయాలను సిల్లీ మాంక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ చూసుకుంటుంది.