మంగళవారం, 11 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 జులై 2022 (16:38 IST)

షారూఖ్-సల్మాన్ ఒకే సినిమాలో కనిపిస్తే ఎలా వుంటుంది?

Sharukh Khan
Sharukh Khan
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒకే మూవీలో కలిసి నటించనున్నారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్.. ఇద్దరు హీరోల కలయికలో ఓ భారీ యాక్షన్‌ చిత్రం చేయాలనేది యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ అధినేత ఆదిత్యచోప్రా ఆలోచనగా తెలుస్తోంది. ఆ దిశగా ఆయన కథను కూడా సిద్ధం చేశారనేది బాలీవుడ్‌ వర్గాల సమాచారం. 
 
ఒకవేళ ఇదే నిజమైతే 1995లో వచ్చిన 'కరణ్‌ అర్జున్‌' మూవీ తర్వాత షారూక్‌, సల్మాన్‌ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్‌ సినిమా ఇదే అవుతుంది. సల్మాన్, షారుఖ్ కాంబినేషన్‌లో రాబోయే పవర్ ఫుల్ యాక్షన్ మూవీని 2023లో షూటింగ్ ప్రారంభించి 2024లో విడుదల చేయనున్నారని తెలుస్తోంది. 
 
ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నారని బాలీవుడ్ టాక్. సల్మాన్, షారుఖ్‌లు కలిసి నటిస్తారనే విషయంపై సీనియర్ ఫిల్మ్ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.