శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 23 జూన్ 2022 (19:22 IST)

తరుణ్ భాస్కర్ చిత్రం టైటిల్ కీడా కోలా

Tarun Bhaskar, Kida Kola
Tarun Bhaskar, Kida Kola
దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో వచ్చిన పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది.. రెండూ పెద్ద విజయాలు సాధించాయి. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాలను తీయడంలో దిట్ట అనిపించుకున్న తరుణ్ భాస్కర్ ఈసారి సరికొత్త క్రైమ్ కామెడీతో రాబోతున్నారు.
 
విజి సైన్మా మొదటి ఫీచర్ లెంగ్త్ ప్రొడక్షన్ గా నిర్మాతలు ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడంతో పాటు టైటిల్ కూడా రిలీజ్ చేసారు. ఈ చిత్రానికి 'కీడా కోలా' అనే ఆసక్తికరమైన టైటిల్‌ను పెట్టారు.
 
కీడా అంటే ఆరు కాళ్లు ఉన్న పురుగు, కోలా అనేది ప్రముఖ సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ పేరు. పోస్టర్‌లో సాఫ్ట్ డ్రింక్ సీసా క్యాప్ పై టైటిల్ రాసి ఉంది. డ్రింక్ కి బదులు రక్తం పొందుతూ బయటికి రావడం పోస్టర్ లో ఆసక్తికరంగా వుంది. అలాగే పోస్టర్ లో ఒక పురుగుని కూడా గమనించవచ్చు. "మునుపెన్నడూ చూడని క్రైమ్ కామెడీని ఎక్సపీరియన్స్ చేయండి..." అని మేకర్స్ వెల్లడించారు.
 
పెళ్లి చూపులు, ఈ నగరానికి పోస్టర్లు పసుపు రంగులో డిజైన్ చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ఆ సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ 'కీడా కోలా' పోస్టర్ ని కూడా పసుపు రంగులో డిజైన్ చేయడం విశేషం.
 
 భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ, శ్రీనివాస్ కౌశిక్, సాయికృష్ణ గద్వాల్, విజయ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2023లో విడుదల కానుంది.
 
ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో చిత్ర యూనిట్ వెల్లడించనుంది.
 
రచన, దర్శకత్వం: తరుణ్ భాస్కర్ దాస్యం, ప్రొడక్షన్ హౌస్ - విజి సైన్మా, రైటర్స్ రూమ్ - క్విక్ ఫాక్స్, నిర్మాతలు : భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ, శ్రీనివాస్ కౌశిక్, సాయికృష్ణ గద్వాల్, విజయ్ కుమార్