శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 23 ఆగస్టు 2022 (18:26 IST)

తరుణ్ భాస్కర్ పాన్ ఇండియా మూవీ కీడా కోలా

Tarun Bhaskar Dasyam, Suresh Babu, Siddharth
Tarun Bhaskar Dasyam, Suresh Babu, Siddharth
ట్యాలెంటడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో వచ్చిన పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది.. రెండూ పెద్ద విజయాలు సాధించాయి. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాలను తీయడంలో దిట్ట అనిపించుకున్న తరుణ్ భాస్కర్ ఈసారి సరికొత్త క్రైమ్ కామెడీ మూవీ 'కీడా కోలా' ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
 
విజి సైన్మా బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1 గా తెరకెక్కబోతోన్న ఈ చిత్రం మంగ‌ళ‌వారంనాడు గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. నిర్మాత సురేష్ బాబు, హీరోలు సిద్ధార్థ్, తేజ సజ్జా, నందు, పలువురు యువ దర్శకులు హాజరై చిత్ర యూనిట్ కి బెస్ట్ విశేష్ అందించారు.  త్వరలోనే చిత్ర యూనిట్ షూటింగ్ ప్రారంభించనుంది.
 
శ్రీపాద్ నందిరాజ్, సాయికృష్ణ గద్వాల్, ఉపేంద్ర వర్మ, వివేక్ సుధాంషు, కౌశిక్ నండూరి నిర్మిస్తున్న ఈ చిత్రం 2023 లో పాన్ ఇండియా థియేట్రికల్ రిలీజ్ కానుంది.  
 
ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తారు.
 
రచన, దర్శకత్వం: తరుణ్ భాస్కర్ దాస్యం, ప్రొడక్షన్ హౌస్ - విజి సైన్మా, రైటర్స్ రూమ్ - క్విక్ ఫాక్స్, నిర్మాతలు : శ్రీపాద్ నందిరాజ్, సాయికృష్ణ గద్వాల్, ఉపేంద్ర వర్మ, వివేక్ సుధాంషు, కౌశిక్ నండూరి.పీఆర్వో : వంశీ- శేఖర్