ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 16 ఆగస్టు 2022 (17:15 IST)

రెజీనా కసాండ్రా, నివేదా థామన్ న‌టించిన శాకిని డాకిని డేట్ ఫిక్స్‌

Regina Cassandra, Niveda Thaman
Regina Cassandra, Niveda Thaman
‘ఓ బేబీ' సూపర్ హిట్ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై సౌత్ కొరియా యాక్షన్-కామెడీ చిత్రం 'మిడ్‌నైట్ రన్నర్స్' కు అధికారిక రీమేక్ గా నిర్మాతలు డి.సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్వూ థామస్ కిమ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం శాకిని డాకిని. రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.
 
నిర్మాతలు సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. శాకిని డాకిని సెప్టెంబర్ 16న థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో డేర్‌డెవిల్ లేడీస్ రెజీనా, నివేద సీరియస్ లుక్ ఇంటెన్స్ గా వుంది. టైటిల్ మధ్య అక్షరాలకు పింక్ కలర్ ఇవ్వడం, పోస్టర్ లో ఆ పింక్ లైట్ రెజీనా, నివేదపై పడటం ఆసక్తికరంగా వుంది.
 
మిడ్‌నైట్ రన్నర్స్  గ్లోబల్ అప్పీల్ కలిగి కథ. కంటెంట్ తెలుగు ప్రేక్షకులకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఈ చిత్రానికి రిచర్డ్ ప్రసాద్ కెమెరామెన్‌గా, మిక్కీ మెల్క్రెరీ సంగీత దర్శకుడుగా, విప్లవ్ నైషధం ఎడిటర్ గా పని చేస్తున్నారు.
 
సాంకేతిక విభాగం- దర్శకత్వం:  సుధీర్ వర్మ, నిర్మాతలు: డి. సురేష్ బాబు, సునీత తాటి, హ్యూన్‌వూ థామస్ కిమ్,  సహ నిర్మాతలు: యువరాజ్ కార్తికేయన్, వంశీ బండారు, స్టీవెన్ నామ్,  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ శంకర్ డొంకాడ,  సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్,  సంగీతం: మైకీ మెక్‌క్లియరీ, నరేష్ కుమారన్,  ఎడిటర్: విప్లవ్ నైషధం,  అడాప్టెడ్ స్క్రీన్ ప్లే , డైలాగ్స్: అక్షయ్ పూల్లా.