శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 14 జులై 2022 (16:30 IST)

రెజీనా, అనుప‌మ పర‌మేశ్వ‌ర‌న్ చిత్రం మ‌రీచక

Regina Cassandra, Anupama Parameswaran
Regina Cassandra, Anupama Parameswaran
బ్యూటీఫుల్ హీరోయిన్స్ రెజీనా క‌సాండ్ర‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఓ సినిమాలో న‌టిస్తున్నారు. స‌తీష్ కాశెట్టి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘మ‌రీచక’ అనే టైటిల్‌ను ఖ‌రారు చ‌శారు. విజ‌య్ అశ్విన్ మ‌రో ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ‘మ‌రీచక’ అనే టైటిల్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. క‌ళ్ల‌ను క‌నిక‌ట్టు చేసే భ్ర‌మ అని  ఈ టైటిల్‌కు అర్థం
 
అంద‌రిలో ఆస‌క్తి పెంచుతోన్న ‘మరీచక’ సినిమా కాన్సెప్ట్ పోస్ట‌ర్‌ను గురువారం రోజున విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌ను గ‌మనిస్తే అందులో కేవ‌లం పాదాలు మాత్ర‌మే క‌నిపిస్తున్నాయి. ఆ పాదాల ప్ర‌తిబింబం నీళ్ల‌లో ఓ అమ్మాయి నీడ‌లాగా క‌నిపిస్తోంది. ఈ పోస్ట‌ర్‌కు ‘ప్రేమ ద్రోహం ప్ర‌తీకారం’ అనేది క్యాప్షన్. ఈ పోస్ట‌ర్ అంద‌రిలో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ఉన్న ఆస‌క్తిని మ‌రింత పెచింది.
 
ఇప్ప‌టికే ఈ సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. జూలై 26 నుంచి రెండో షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా ఈ రొమాంటిక్ డ్రామాకి సంగీతాన్ని అందిస్తున్నారు. అర‌వింద్ క‌న్నాభిరాన్ ఈ మూవీకి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.
 
వ‌న్ మోర్ హీరో బ్యాన‌ర్‌పై రవి చిక్కాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ల‌క్ష్మీ భూపాల ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, పాట‌ల‌ను అందించారు. దీంతో పాటు ల‌క్ష్మీ భూపాళ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై ఈ  చిత్రానికి స‌హ నిర్మాత‌గానూ వ్య‌వ‌హ‌రించారు.
 
20 ఏళ్ల పాటు యానిమేష‌న్ రంగంలో త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకుని రాజీవ్ చిక్కా ఛోటా భీమ్‌ను రూపొందించారు. ఇప్పుడు వ‌న్ మోర్ హీరో అనే బ్యాన‌ర్‌ను ప్రారంభించారు.