గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 జులై 2022 (15:07 IST)

రెజీనా కాసాండ్రా ప్రెగ్నెంటా?

regina
కమెడియన్ అలీ ఓ ఛానల్‌లో నిర్వహించే ఇంటర్వ్యూ కార్యక్రమంలో రెజినా కసాండ్రా ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది. అందులో, ప్రెగ్నెన్సీ వ్యవహారమొకటి. అర్థరాత్రి 11 గంటల సమయంలో మిస్టీ దోయ్ స్వీట్ తినాలని అనిపించిందట రెజినాకి.
 
స్వీట్ తినాలనిపించి, స్వీట్ షాప్‌కి వెళ్ళి అడిగితే, దుకాణం యజమాని, ఆ దుకాణాన్ని కట్టేస్తున్నట్లు చెప్పాడట. 
 
దాంతో, 'సార్.. సార్.. నేను ప్రెగ్నెంట్.. నాకు స్వీట్ ఇప్పుడే తినాలని వుంది..' అని రెజినా బతిమాలేసిందట. దాంతో, ఆ షాప్ యజమాని, షాప్ వెంటనే మళ్ళీ తెరిచాడట.
 
అలా ఆ రోజు అబద్ధం చెప్పి తాను అర్థరాత్రి పూట తనకిష్టమైన స్వీటు తిన్నానని రెజినా, అలీ ఇంటర్వ్యూలో చెప్పింది.