శుక్రవారం, 1 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 జూన్ 2022 (10:05 IST)

మహబూబ్‌నగర్‌లో దారుణం: గర్భవతిపై యువకులు అత్యాచారం

మహబూబ్‌నగర్‌లో దారుణం జరిగింది. గర్భవతిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన కోయిలకొండలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కోయిలకొండ మండలంలోని ఒక గ్రామానికి చెందిన పదమూడేళ్ల బాలికపై కొన్ని నెలల క్రితం కోయిలకొండకు చెందిన రవి కుమార్, శ్రీకాంత్ కలిసి దారుణానికి పాల్పడ్డారు. 
 
ఆ ఊరికి సమీపంలోని పిండిగిర్నిలో అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వత కూడా బాధితురాలి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పలుమార్లు లైంగిక దాడికి దిగారు. 
 
కాగా, వారం రోజుల క్రితం బాలిక కడుపు నొప్పితో బాధపడుతుంటూ తల్లి గమనించింది. గట్టిగా నిలదీయడంతో ఈ విషయం తల్లికి తెలిపింది. 
 
దీంతో కోయిలకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా గర్భిణి అని తేలింది. ఈ విషయాన్ని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఈ మేరకు ఎస్సై శీనయ్య పోక్సో, ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.