1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 జూన్ 2022 (15:11 IST)

ఉమెన్ సాఫ్ట్‌వేర్ టెక్కీని చంపేసిన ఆన్‌లైన్ రమ్మీ క్రీడ

suicide
తమిళనాడు రాష్ట్ర రాష్ట్ర రాజధాని చెన్నైలో ఓ విషాదం జరిగింది. ఆన్‌లైన్ రమ్మీకి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆన్‌లైన్ గేమ్స్ మత్తులో పడిన ఈ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
చెన్నైకు చెందిన భవానీ అనే ఓ మహిళా టెక్కీ ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నారు. ఆమె ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లే సమయంలో ఆన్‌లైన్ రమ్మీగేమ్ ఆడటం ఓ అలవాటుగా మారింది. ఇది ఓ వ్యసనంగా మారిపోయింది. దీంతో రమ్మీ గేమ్ కోసం తన సోదరుల నుంచి రూ.3 లక్షల డబ్బును అప్పుగా తీసుకున్నారు. 
 
దీంతోపాటు తన వద్ద ఉన్న 20 తులాల బంగారాన్ని కూడా విక్రయించింది. అంతేకాకుండా, అందిన చోటల్లా అప్పులు చేసింది. ఈ అప్పులు పెరిగిపోవడంతో పాటు వాటిని తిరిగి చెల్లించేలని పరిస్థితి ఏర్పడటంతో దిక్కుతోచని స్థితిలో భవానీ ఆత్మహత్యే శరణ్యమని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై చెన్నై మణలి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపగా, ఆన్‌‍లైన్ రమ్మీకి బానిసగా మారి ఈ దారుణానికి పాల్పడినట్టు తేలింది.