గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 జూన్ 2022 (12:49 IST)

అప్పులు తీర్చలేదని మహిళను స్తంభానికి కట్టేసి కొట్టిన మహిళ

woman tied
తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించకపోవడంతో ఓ మహిళను గ్రామస్తులు స్తంభానికి కట్టేసి కొట్టారు. ఈ ఘటన ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం శివిని గ్రామానికి చెందిన మహిళ గ్రామంలో చిట్టీల వ్యాపారం నడిపిస్తుంది. 
 
కొన్ని సంపత్సరాలుగా చిట్టీల వ్యాపారం కొనసాగిస్తుంది. అయితే, గ్రామస్తులు ఆమె వద్ద చిట్టీ వేశారు. కొంతకాలంకు చిట్టీల డబ్బులు జమ అవుతున్నాయికానీ డబ్బులు మాత్రం తిరిగి ఇవ్వడం లేదు. చిట్టీల ఎత్తుకున్న వారికి డబ్బులు ఇవ్వకపోవడంతో నెలవారి వడ్డీని సైతం చెల్లించడం లేదు. 
 
ఈ క్రమంలో పలుసార్లు సదరు మహిలను ప్రశ్నించడంతో తన వద్ద డబ్బులు లేవని వచ్చాక ఇస్తానంటూ తేల్చి చెప్పింది. డబ్బులు కోసమని నాపై ఒత్తిడి ఆత్మహత్య చేసుకొని చనిపోతానిని బెదిరింపులకుసైతం దిగింది. దీంతో చేసేదేమీలేక గ్రామస్తులు మహిళపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఏప్రిల్ 7న కేసు నమోదు చేశారు. 
 
గ్రామస్తుల నుంచి చిట్టీల పేరుతో సదరు మహిళ రూ.1.40 కోట్లు సేకరించినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి ఆమెను విడిపించారు. ఈ ఘటనకు సంబంధించి ఎనిమిది మందిపై గ్రామస్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.