సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 జూన్ 2022 (07:58 IST)

ఆరేళ్ల చిన్నారిని కాటేసిన కామాంధ వలంటీరు

victim
ఏలూరులో ఆరేళ్ళ చిన్నారిని ఓ కామాంధ వలంటీరు కాటేశాడు. తన బంధువే కదా అని చిన్నారిని పంపిస్తే ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ వ్యవహారంపై దిశ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
ఏలూరుకు చెందిన ఓ కుటుంబంలోని వ్యక్తి అనారోగ్యం పాలయ్యాడు. ఆయన్ను ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి, తమ ఆరేళ్ళ కుమార్తెను మేనమామ కుమారుడు శ్రవణ్ కుమార్ వద్ద అప్పగించారు. కానీ, ఆ చిన్నారిపై కీచకుడి కన్నుపడింది. లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఈ ఘటన జరిగి మూడు నెలలు అయింది. 
 
అయితే, ఇటీవలి కాలంలో చిన్నారి ఆ కామాంధుడుని చూసినపుడల్లా భయంతో వణికిపోసాగింది. దీంతో ఆ చిన్నారి వద్దా ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.