సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 జూన్ 2022 (19:41 IST)

మహిళలకు ప్రధాని గుడ్ న్యూస్.. రూ. 3400 సాయం కోసం ఏం చేయాలి?

modi
కేంద్ర ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే మహిళాభివృద్ధి కోసం ఎన్నెన్నో పథకాలను అమలు చేస్తోన్న కేంద్రం పేద ప్రజల కోసం.. వారికి ఆర్థిక సాయం అందించేందుకు రంగం సిద్ధం చేసింది. దేశంలోని పేద మహిళలకు ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేసే పథకాలు ఎన్నో ఉన్నాయి. అందులో జననీ సురక్ష యోజన పథకం ఒకటి.
 
ఈ పథకం కింద ప్రభుత్వం మహిళలకు రూ.3400 సహాయం అందిస్తుంది. దేశంలోని దారిద్య్రరేఖకు దిగువన ఉన్న మహిళలకు ప్రభుత్వం అనేక విధాలుగా ఆర్థిక సహాయం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం గర్భిణీ స్త్రీలకు ఆర్థిక సాయం చేస్తుంది. ఈ పథకం పేరే 'జననీ సురక్ష యోజన'. దేశంలోని గర్భిణులు, నవజాత శిశువుల పరిస్థితి మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది.
 
జననీ సురక్ష యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో నివసించే గర్భిణులు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న మహిళలకు ప్రభుత్వం రూ.1400 ఆర్థిక సహాయం అందజేస్తోంది. 
 
అంతేగాకుండా.. డెలివరీ ప్రమోషన్ కోసం ఆశా సహాయక్‌కు రూ. 300 ఇవ్వబడుతుంది. అదే సమయంలో డెలివరీ తర్వాత సేవలను అందించడానికి రూ. 300 కూడా ఇవ్వబడుతుంది.
 
అంతేగాకుండా రూ.1000 ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఇది కాకుండా, డెలివరీ ప్రోత్సాహకం కోసం ఆశా సహాయక్‌కు రూ. 200, డెలివరీ తర్వాత సేవలను అందించడానికి రూ. 200 అందించబడుతుంది. ఈ విధంగా మొత్తం రూ.400 ఇస్తారు. ఇలా మొత్తంగా పేద మహిళలకు మోదీ ప్రభుత్వం రూ.3400 అందిస్తోంది.
 
 
ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే.. ఆధార్ కార్డు తప్పనిసరి.  
 
BPL రేషన్ కార్డు
చిరునామా రుజువు
జననీ సురక్ష కార్డ్
ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా జారీ చేసిన డెలివరీ సర్టిఫికేట్
బ్యాంకు ఖాతా పాస్ బుక్
మొబైల్ నంబర్
పాస్‌పోర్టు సైజు ఫోటో వుండాలి. 
 
ఈ పథకం ద్వారా ఆర్థిక సాయాన్ని ఎలా పొందాలి అంటే..
 
మీరు ఈ లింక్ ద్వారా ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలిమీ.రు ఈ ఫారమ్‌లో అవసరమైన అన్ని వివరాలను పూరించాలి.. దీని తరువాత అవసరమైన అన్ని పత్రాలను జత చేయండి. అంగన్‌వాడీ లేదా మహిళా ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించాలి. 
 
దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుండి గర్భిణీ స్త్రీలు దరఖాస్తు చేసుకోవచ్చు. 19 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలకు మాత్రమే ఈ ఆర్థిక సహాయం అందించబడుతుంది.