సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 మే 2022 (17:24 IST)

ఇంగ్లండ్: ఇద్దరు మహిళా క్రికెటర్లు వివాహం.. శుభాకాంక్షల వెల్లువ

England Women Cricketers
England Women Cricketers
ప్రపంచ కప్‌లో ఆడిన  ఇద్దరు మహిళా క్రికెటర్లు వివాహం చేసుకున్నారు. వాళ్లెవరంటే.. క్యాథరీన్ బ్రంట్, నాట్ స్కివర్‌లే. 2017 ప్రపంచ కప్‌లో వీరు ఆడారు. వీరిద్దరికీ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు శుభాకాంక్షలు తెలిపింది. 
 
ఇకపోతే.. ఇంగ్లండ్ తరపున క్యాథరీన్ బ్రంట్14 టెస్టులు, 140 వన్డేలు, 96 టీ20లు ఆడింది. అన్ని ఫార్మాట్లలో ఆమె 316 వికెట్లు తీసింది. 
 
మరోవైపు, స్కివర్ 7 టెస్టులు, 89 వన్డేలు, 91 టీ20లు ఆడింది. ఈ ఏడాది జరిగిన వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్స్ లో ఆమె 148 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది.