శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (18:08 IST)

ఆహా... ఈ ఆహ్వానం అద్భుతం, భవిష్యత్‌లో ఇలాంటిది పొందలేనేమో? ప్రధాని మోదీపై ఇంగ్లండ్ ప్రధాని ప్రశంస

Johnson-Modi
ఫోటో కర్టెసి-ట్విట్టర్
ఆహా... ఈ ఆహ్వానం అద్భుతం, భవిష్యత్‌లో ఇలాంటిది పొందలేనేమో? అంటూ భారత ప్రధాని మోదీ ఆహ్వానించిన తీరుపై ఇంగ్లండ్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రశంసల వర్షం కురిపించారు. తను ఇప్పటివరకూ ఇంతటి సంతోషకరమైన ఆహ్వానాన్ని మునుపెన్నడూ చూడలేదనీ, ఇకముందు కూడా పొందలేకపోవచ్చునేమో అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసారు.

 
ఇంగ్లాండ్ ప్రధాని జాన్సన్ రెండురోజుల పర్యటన నిమిత్తం భారతదేశం వచ్చారు. తొలుత ఆయన గురువారం గుజరాత్ రాష్ట్రంలో పర్యటించారు. ఈరోజు ఢిల్లీలో ఆయనకు రాష్ట్రపతి భవన్ వద్ద ప్రధానమంత్రి మోదీ ఆహ్వానం పలికారు. ఆయనకు అక్కడ గార్డ్ ఆఫ్ హానర్ లభించింది.

 
ఈ సందర్భంగా ఇంగ్లండ్ ప్రధాని మాట్లాడుతూ... ఇంతటి శుభకరమైన పరిస్థితి ఇంగ్లాండ్-భారత్ మధ్య మునుపెన్నడూ నేను చూడలేదన్నారు. ఇలాంటి తరుణంలో నాకు ఆహ్వానం అందటం ఎంతో సంతోషంగా వుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్యామ్య దేశమైన భారతదేశంతో దౌత్య,ఆర్థిక సంబంధాలపై చర్చించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.