శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 జనవరి 2022 (12:17 IST)

బ్రిటన్‌లో కోవిడ్ అత్యవసర చట్టాలన్నీ రద్దు దిశగా అడుగులు...

అగ్రదేశం బ్రిటన్‌లో కోవిడ్ అత్యవసర కాలంలో జారీ చేసిన అన్ని చట్టాలను రద్దు చేసే దిశగా ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ అడుగులు వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కోవిడ్ ఎమర్జెన్సీ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. అలాగే, కరోనా ఐసోలేషన్ గడువును కూడా వారం రోజుల నుంచి ఐదు రోజులకు కుదించారు. 
 
ముఖ్యంగా, అపరాధాలు, న్యాయపరమైన చర్యలు తీసుకోవడం వల్ల కరోనా వైరస్ పాజిటివ్ కేసుల తగ్గుతాయని తాము భావించడం లేదని అంటున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా కోవిడ్‌ను కట్టడి చేసే విధంగా ప్రణాళకలు సిద్ధం చేయాలని ఆయన వైద్య నిపుణులను ఆయన కోరారు.
 
ముఖ్యంగా, కరోనా ఆంక్షలపై ఇప్పటికే బ్రిటన్ ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెల్సిందే. దీంతో బోరిస్ జాన్సన్ కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. మరోవైపు బ్రిటన్‌లో ఇటు కోవిడ్ పాజిటివ్ కేసులతో పాటు మరోవైపు, ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గాయి. దీంతో దేశంలో కోవిడ్ ఆంక్షలన సడలించాలని ఆయన భావిస్తున్నట్టు తెలిపారు.