మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 16 జనవరి 2022 (16:41 IST)

పండగ వేళ బ్యాడ్ న్యూస్ వెల్లడించిన స్టార్ హీరో మమ్ముట్టి

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరింది. దీంతో అనేక సినీ రాజకీయ ప్రముఖులు ఈ వైరస్ బారినపడుతున్నారు. ఈ క్రమంలో మలయాళ సూపర్ స్టార్ మమ్మూట్టి కూడా ఈ వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన పండగ పూట వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
"అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నేను నిన్న కోవిడ్ పాజిటివ్ బారినపడ్డాను. తేలికపాటి జ్వరం తప్ప నేను బాగానే ఉన్నాను. సంబంధిత అధికారుల సూచన మేరకు నేను ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎల్లవేళలా మాస్క్ వేసుకుని జాగ్రత్త వహించండి" అని మమ్మూట్టి ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.