సంబంధిత వార్తలు
- ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన
- మౌత్ పబ్లిసిటీ పై నమ్మకంతో చౌర్య పాఠం విడుదల చేస్తున్నాం : త్రినాథరావు నక్కిన
- వరుణ్ తేజ్ లాంచ్ చేసిన చౌర్య పాఠం లో ఒక్కసారిగా సాంగ్
- చౌర్య పాఠం నుంచి ఆడ పిశాచం.. సాంగ్ రిలీజ్
- త్రినాథరావు నక్కిన నిర్మాణంలో చౌర్య పాఠం రిలీజ్ డేట్ ఫిక్స్
థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన
Trinadharao Nakkina
నిర్మించడానికి ఈ కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలు ఏమిటి?
-కార్తిక్ ఘట్టమనేని ఫాదర్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశారు. ఆయన సర్వీస్ లో ఉన్నప్పుడు ఓ చిలిపి దొంగతనం కేసు జరిగింది. ఆ సంఘటన గురించి కార్తిక్ చెప్పినప్పుడు చాలా ఇంట్రస్టింగ్ గా అనిపించింది. ఇది సినిమాగా చేయమని కార్తిక్ ని అడిగాను. తను సరే అన్నాడు. అలా ఈ సినిమా చేయడం జరిగింది. ఆ కేసుని యధావిధిగా తీసుకోలేదు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని పూర్తి సినిమాటిక్ గా చేయడం జరిగింది.
హైస్ట్ సినిమాలకి బడ్జెట్ ఎక్కువ అవుతుంది కదా ?
-అవును. మామూలు సినిమాలు కంటే హైస్ట్ సినిమాలు తీయడం ఖర్చుతో కూడుకున్న పని. మేము అనుకున్నదాని కంటే ఒక పదిశాతం బడ్జెట్ పెరిగింది. కంపనీ నుంచి వస్తున్న తొలి సినిమా. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి క్యాలిటీతో తీశాం. అందులోనూ కార్తిక్ లాంటి డీవోపీ వున్నప్పుడు టెక్నికల్ గా చాలా యాడ్ ఆన్స్ వుంటాయి. సినిమా అవుట్ పుట్ ఎక్సలెంట్ క్యాలిటీతో వచ్చింది.
డైరెక్టర్ నిఖిల్ గురించి?
-నిఖిల్ ని కార్తికేయ షూటింగ్ లో చూశాను. చాలా యాక్టివ్ గా వర్క్ చేస్తాడు. ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు అనుకున్న సమయంలో కార్తిక్.. నిఖిల్ పేరు చెప్పాడు. ఈ సినిమాకి విజువల్ సెన్స్ వున్న డైరెక్టర్ కావాలి. నిఖిల్ కి ఆ ఇమాజినేషన్ వుంది. నేను ఎలా అనుకున్నానో అలా సినిమాని తీర్చిదిద్దాడు. సినిమాని హెల్తీగా ఫినిష్ చేశాం. సినిమా చాలా మెచ్యుర్డ్ గా వుంటుంది. కాన్సెప్ట్ అందరినీ అలరిస్తుంది.
నిర్మాణంలోకి రావడానికి కారణం?
-కొత్తవాళ్ళకి ఒక ఫ్లాట్ ఫామ్ క్రియేట్ చేయడం నా డ్రీం. అది ఎప్పటినుంచో ఉంది. ఒక జనరేషన్ కి ఒక వేదిక ఇచ్చినట్లుగా వుంటుంది. నాకు సంపాదన మీద దృష్టి లేదు. కొత్త వారికి అవకాశం కల్పించాలనే మంచి ఉద్దేశంతోనే నిర్మాణంలోకి రావడం జరిగింది.
మొన్న మీరు థియేటర్స్ పై కామెంట్స్ చేయడానికి కారణం?
-వైరల్ కావాలని ఆ కామెంట్స్ చేయలేదు. యధార్ధం తెలియాలని చెప్పాను. నిజానికి నేను థియేటర్స్ కి రమ్మని ఆడియన్స్ ని రిక్వెస్ట్ చేశాను. థియేటర్స్ కల్చర్ ని కంటిన్యూ చేయమని కోరారు. కానీ అది వదిలేసి ముందు చెప్పిన మాటలే హైలెట్ చేశారు.
ఆడియన్స్ థియేటర్స్ కి తగ్గడానికి కారణం ఏమిటి ?
-చాలా కారణాలు వున్నాయి. సినిమాలు చాలా జాగ్రత్తగా తీయాల్సిన పరిస్థితి వుంది. ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించే సినిమాలు తీయడంపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి.
