వరుణ్ తేజ్ లాంచ్ చేసిన చౌర్య పాఠం లో ఒక్కసారిగా సాంగ్
Indra Ram, Payal Radhakrishna
దావ్‌జాండ్ ఈ సాంగ్ లవ్లీ మెలోడీగా కంపోజ్ చేశారు. అనురాగ్ కులకర్ణి సాంగ్ ని పాడిన విధానం మరింత ఆకట్టుకుంది. కృష్ణ కాంత్ రాసిన లిరిక్స్ బ్యూటీఫుల్ గా వున్నాయి. ఈ సాంగ్ లో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ఈ సాంగ్ ఇన్స్టంట్ హిట్ గా నిలిచింది.
ఈ చిత్రంలో పాయల్ రాధాకృష్ణ కథానాయికగా నటిస్తుండగా, రాజీవ్ కనకాల, మస్త్ అలీ ముఖ్యమైన కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో మరో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ ఈ కథను సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని రాశారు. అతను కెమెరా వర్క్ కూడా నిర్వహిస్తున్నారు. దావ్‌జాంద్ మ్యూజిక్ అందిస్తున్నారు. హనుమాన్ ఫేమ్ శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్. ఉతుర ఎడిటర్.
సమ్మర్ లో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ అట్రాక్షన్ గా 'చౌర్య పాఠం' ఏప్రిల్ 18న థియేటర్లలోకి రాబోతోంది.
తారాగణం: ఇంద్ర రామ్, పాయల్ రాధాకృష్ణ, రాజీవ్ కనకాల, మస్త్ అలీ, మాడి మానేపల్లి, అంజి వల్గుమాన్, ఎడ్వర్డ్ పెరేజీ, సుప్రియ ఐసోలా, క్రీష్ రాజ్, సహదేవ్
