Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం
వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఇండో-కొరియన్ హారర్-కామెడీ #VT15 తో సర్ ప్రైజ్ చేయబోతున్నారు. వరుణ్ తేజ్ పుట్టినరోజున అనౌన్స్ చేసిన ఈ చిత్రం ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఎక్సయిటింగ్ పోస్టర్ చాలా క్యురియాసిటీని పెంచింది, థ్రిల్లింగ్, హిలేరియస్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని హామీ ఇచ్చింది. UV క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో S థమన్ సంగీతం అందించనున్న ఈ చిత్రం వరుణ్ తేజ్ కెరీర్‌లో ఒక ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్‌గా కాబోతోంది.
ఈ చిత్రం ఈరోజు హైదరాబాద్‌లో జరిగిన పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమైయింది. ఈ వేడుక అఫీషియల్ గా ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌కు నాంది పలికింది. పూజా కార్యక్రమంలో ప్రాజెక్ట్ లోని టీం సభ్యులు పాల్గొన్నారు. ఈ యూనిక్ సినిమాటిక్ అడ్వంచర్ ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు.
#VT15 రెగ్యులర్ షూటింగ్ కూడా ఈరోజే హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరికొత్త పాత్రలో అలరించబోతున్నారు.
ఈ హిలేరియస్ అడ్వంచరస్ మూవీకి సంబధించిన మరిన్ని అప్‌డేట్స్ ని మేకర్స్ త్వరలో తెలియజేయనున్నారు. ఈ సినిమా ఎమోషన్స్, థ్రిల్స్ రోలర్-కోస్టర్ రైడ్ గా ఉండబోతోంది.