1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Megastar Chiranjeevi Vishwambhara technical team change!

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర టెక్నికల్ టీమ్ మార్పు !

Vishwambhara Poster
Vishwambhara Poster
మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర చిత్రం అనుకున్నట్లు జనవరి 10న విడుదల కావాల్సింది. కానీ పుష్ప 2 విడుదలకావడంతో డిసెంబర్ లో అనుకున్న గేమ్ ఛేంజర్ వాయిదా పడి జనవరి 10న ఫిక్స్ అయ్యారు. అయితే తన కుమారుడి కోసం తండ్రి వాయిదా వేసుకున్నాడని కొందరంటే, టీజర్ తర్వాత చిరంజీవి అంత హ్యాపీగా లేరని తెలిసిందంటూ మరో వార్త వచ్చింది. ఏది ఏమైనా టీజర్ తర్వాత విశ్వంజరకు వచ్చిన మిక్స్డ్ రెస్పాన్స్ తో మేకర్స్ కొంచెం వెనకడుగు వేశారు. మెయిన్ గా వి ఎఫ్ ఎక్స్ పరంగా వచ్చిన కామెంట్స్ పై తగు జాగ్రత్తలు ఇపుడు తీసుకుంటున్నారట.
 
త్రిష హీరోయిన్ గా దర్శకుడు వశిష్ట తెరకెక్కించిన “విశ్వంభర” కోసం ఎఫ్ ఎక్స్ పరంగా గతంలో వర్క్ చేసిన గ్రాఫికల్ టీం ని తీసి కొత్త టీం ని తీసుకుని చేయిస్తున్నట్లు తాజా వార్త. దీనితో కొంచెం బెటర్ గా విజువల్స్ ని  అందిస్తారని మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తోంది. సోషల్ మీడియాలో జరిగిన నెగిటివిటీకి మేకర్స్ తీసుకుని తగు జాగ్రత్తలు తీసుకోవడం పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఎం ఎం కీరవాణి సంగీతం సమకూర్చిన ఈ చిత్రాన్నరి యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.
తర్వాతి కథనం
ఇన్ని కండోమ్‌లైతే కన్యలు దొరకడం కష్టమే, ఐతే మేకలు, కుక్కలతో శృంగారం కోసం కొనండి: చిన్మయి ఘాటు రిప్లై