శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 2 జనవరి 2025 (22:57 IST)

రాజమౌళి, మహేష్ బాబు సినిమా రిలీజ్ డేట్ తెలిపిన రామ్ చరణ్

cherry-rajamouli
గేమ్ ఛేంజర్ ట్రైలర్ ఆవిష్కరణ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతుండగా, యాంకర్ సుమ కలుగజేసుకుని ఈరోజే మహేష్ బాబు సినిమా లాంఛ్ అయిందిగదా. నాకు ఫొటోలు చూపించండి అన్నారు. మనిద్దం బయట మాట్లాడుకుందాం అంటూ సమాధానమిచ్చారు. అయితే రామ్ చరణ్ మాట్లాడేటప్పుడు కూడా సుమ కలుగచేసుకుని రాజమౌళి, మహేష్ బాబు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పగలరా? అంటూ సరదాగా ప్రశ్న వేసింది. 
 
రామ్ చరణ్ మాట్లాడుతూ, నాకు తెలిసి ఏడాదిన్నరలో వచ్చేస్తుంది అంటూ చెప్పేశారు. ఆ వెంటనే రాజమౌళి.. బాగా ట్రైనింగ్ తీసుకున్నట్లున్నావ్.. అంటూ భుజంతట్టి అభినందించారు. ఇలా సరదాగా సాగింది గేమ్ ఛేంజర్ ట్రైలర్ ఆవిష్కరణ.
 
ఇక సినిమా గురించి చరణ్ మాట్లాడుతూ, ఈ సినిమాకు పిల్లర్ లు చాలామంది వున్నారు. సినిమాటోగ్రఫీ నుంచి నటీనటులు అంటూ పేరుపేరునా ప్రస్తావించారు. తాను పోషించిన పొలిటీషన్ పాత్ర గురించి మాట్లాడుతూ, తమిళనాడులో ఓ పొలిటీషన్ వున్నారు. ఆయన చేసిన కార్యక్రకమాలు బేస్ చేసుకుని నేను చేశాను. దర్శకుడు శంకర్ అద్భుతంగా ఆవిష్కరించారు. అలాగే రాక్ స్టార్ థమన్ మంచి సంగీతం ఇచ్చారు. జనవరి 10న సినిమాను అందరూ చూడాలన్నారు.