శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 31 డిశెంబరు 2024 (18:54 IST)

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

Un stapable show Game Changer
Un stapable show Game Changer
రామ్ చరన్ నటించిన  ‘గేమ్ ఛేంజర్’ కొత్త ఏడాది సంక్రాంతికి రాబోతుంది.  ఈ సందర్భంగా బాలక్రిష్ణ చేస్తున్న అన్‌స్టాపబుల్ షోలో నేడు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన స్టిల్స్ ను విడుదల చేశారు. అయితే చరణ్ కు తోడుగా శర్వానంద్ కూడా తోడయ్యాడు. చిరంజీవి కుటుంబానికి దగ్గరివాడైన శర్వానంద్ ఈ షోలో పాల్గొనడం విశేషం.
 
దర్శకుడు శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సమకాలీన రాజకీయ అంశాలతో రూపొందింది. ఈ షోలో రామ్ చరణ్ కు బాలక్రిష్ణ పలు ఆసక్తికరమైన అంశాలు ముందుంచారు. అవి ఏమిటి? అనేవి త్వరలో తెలియనున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ టాక్ షోలో చరణ్, శర్వానంద్ స్నేహం గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియనున్నాయి.