శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 31 డిశెంబరు 2024 (10:24 IST)

బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్

Ramcharan -macha song
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన పాపులర్ తెలుగు టాక్ షో అన్‌స్టాపబుల్, వారి సినిమా ప్రమోషన్‌లలో భాగంగా ప్రఖ్యాత సెలబ్రిటీలను ఆకర్షిస్తూనే ఉంది. ఇటీవలే, నటులు వెంకటేష్, అనిల్ రావిపూడి, నిర్మాత సురేష్ బాబు తమ సంక్రాంతి విడుదలను ప్రమోట్ చేయడానికి షోలో పాల్గొన్నారు. 
 
ఈ రాబోయే ఎపిసోడ్ నందమూరి, మెగా కుటుంబాల అభిమానులకు ప్రత్యేక ట్రీట్‌గా ఉంటుందని అంచనా వేయబడింది. ఈ నేపథ్యంలో తన అప్ కమింగ్ ఫిల్మ్ గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్‌లో భాగంగా అన్ స్టాపబుల్‌లో రామ్ చరణ్ కనిపించబోతున్నాడు. 
 
గేమ్ ఛేంజ‌ర్ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా బాల‌య్య షోకి చ‌ర‌ణ్ రానున్న‌ట్లు తెలుస్తోంది. డిసెంబ‌ర్ 31న హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో చ‌ర‌ణ్ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. 
 
గ‌తంలో ఓ సీజ‌న్‌లో ప్ర‌భాస్ ముఖ్య అతిథిగా వ‌చ్చారు. ఆ సంద‌ర్భంలో ఆయ‌న రామ్‌చ‌ర‌ణ్‌కి ఫోన్ చేయ‌గా బాల‌య్య మాట్లాడారు. నా షోకు ఎప్పుడు వ‌స్తున్నావ్ అని బాల‌య్య అడుగ‌గా.. మీరు పిల‌వ‌డ‌మే లేటు అని చ‌ర‌ణ్ అన్నాడు. ఇన్నాళ్ల‌కు ఆ స‌మ‌యం రానే వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది.
 
శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో గేమ్ ఛేంజ‌ర్ మూవీ తెర‌కెక్కింది. ఈ చిత్రంలో కియారా అద్వానీ క‌థానాయిక‌. ఎస్ జే సూర్య‌, శ్రీకాంత్‌, సునీల్‌లు కీల‌క పాత్ర‌లను పోషించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.