గురువారం, 16 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 16 డిశెంబరు 2024 (08:17 IST)

విక్టిమ్, క్రిమినల్, లెజెండ్ అనే ట్యాగ్‌లైన్‌ తో అనుష్క శెట్టి ఘాటి సిద్ధమవుతోంది

Anushka Shetty'- ghaati
Anushka Shetty'- ghaati
క్వీన్ అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఘాటి' గ్లింప్స్ లో ఇంటెన్స్ వైలెంట్ క్యారెక్టర్ లో అందరినీ ఆశ్చర్యపరిచారు. బాహుబలి తర్వాత, అనుష్క నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో పాన్-ఇండియా మూవీ. యువి క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. వేదం విజయం తర్వాత అనుష్క,క్రిష్‌ల కలయికలో వస్తున్న రెండవ చిత్రం ఘాటి, ఇది UV క్రియేషన్స్‌తో కలిసి అనుష్క నాల్గవ సినిమా. 
 
గ్లింప్స్ తో క్యురియాసిటీని క్రియేట్ చేసిన తర్వాత, మేకర్స్ ఇప్పుడు విడుదల తేదీని అనౌన్స్ చేశారు- ఏప్రిల్ 18న ఈ చిత్రం వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. సమ్మర్ రిలీజ్ కి పర్ఫెక్ట్ టైం. ఈ అనౌన్స్మెంట్ క్రిష్, అనుష్క, ఫిల్మ్ మేకర్స్ తో కూడిన ఫన్ వీడియో ద్వారా వచ్చింది. పాన్-ఇండియా మూవీ కోసం సమ్మర్ రిలీజ్ సరైన సీజన్. విడుదల తేదీ పోస్టర్‌లో అనుష్క చీర కట్టుకుని టెర్రిఫిక్ లుక్‌లో కనిపించింది. చేతిలో తుపాకీతో కొండపై నిలబడి, ఆమె శరీరం అంతటా చెల్లాచెదురుగా ఉన్న రక్తపు గుర్తులతో, ఇంటెన్స్ లుక్ ని ప్రజెంట్ చేస్తోంది. 
 
విక్టిమ్, క్రిమినల్, లెజెండ్ అనే ట్యాగ్‌లైన్‌త ఘాటీ అద్భుతమైన కథనాన్ని, మానవత్వం, మనుగడ , ముక్తికి హామీ ఇస్తుంది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విసెరల్, యాక్షన్-ప్యాక్డ్ ఎక్స్ పీరియన్స్ అందించనుంది. 
 
ఈ చిత్రానికి మనోజ్ రెడ్డి కాటసాని సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ కాగా, చాణక్య రెడ్డి తూరుపు ఎడిటర్. చింతకింది శ్రీనివాసరావు కథ అందించగా, సాయిమాధవ్ బుర్రా మాటలు రాశారు.ఈ చిత్రం హై బడ్జెట్‌తో, అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందుతోంది. 
ఘాటి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం , హిందీతో సహా పలు భాషల్లో విడుదల కానుంది.