సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 నవంబరు 2024 (19:49 IST)

డాక్టర్‌ను రెండో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ దర్శకుడు.. ఎవరు?

krish marriage
తెలుగు చిత్ర దర్శకుడు క్రిష్ జాగర్లమూడి రెండో వివాహం చేసుకున్నారు. మొదటి భార్యతో విడాకులు తీసుకోవడంతో ఆయన మళ్లీ రెండో పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్ నగరంలో గైనకాలజిస్ట్‌గా పని చేస్తున్న డాక్టర్ ప్రీతి చల్లాను వివాహం చేసుకున్నారు. ఈ వివాహం అతి నిరాడంబరంగా జరిగింది. ఇందులో ఇరు కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరైనట్టు తెలుస్తుంది. ఈ నెల 16వ తేదీన వీరి రిసెప్షన్ హైదరాబాద్ నగరంలో నిర్వహించనున్నారు. 
 
కాగా, క్రిష్‌కు గతంలో డాక్టర్ రమ్యతో వివాహమైంది. ఆమెతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో డాక్టర్ ప్రీతి చల్లాను ఆయన రెండో వివాహం చేసుకున్నారు. అలాగే డాక్టర్ ప్రీతి చల్లాకు కూడా తన మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్నట్టు, ఒక కుమారుడు సైతం ఉన్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.