సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 ఆగస్టు 2024 (16:56 IST)

మండపానికి తొలి భార్య.... పెళ్లి పీటలపై నుంచి వరుడు పరార్!!

child marriage
తిరుమల తిరుపతిలో ఓ ఆశ్చర్యక ఘటన జరిగింది. విడాకుల కేసు కోర్టులో ఉండగా ఓ వ్యక్తి రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో పెళ్లిపీటలపై కూర్చొన్న వరుడు మండపం నుంచి పారిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
రాకేశ్ అనే వ్యక్తికి తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా పెండ్యాలకు చెందిన సంధ్య అనే మహిళపై ఇదివరకే వివాహమైంది. వీరికి ఓ పాప కూడా ఉంది. ఆ తర్వాత మనస్పర్థల కారణంగా ఇద్దరూ దూరమయ్యారు. వీరిద్దరి విడాకుల కోర్టు ప్రస్తుతం కోర్టులో సాగుతుంది. ఆ విడాకుల పంచాయతీ ముగియకుండానే రాకేశ్ మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. 
 
తిరుమలలోని ఓ మఠంలో వివాహం చేసుకోబోతున్నట్టు మొదటి భార్య సంధ్యకు తెలిసింది. దీంతో ఆమె వెంటనే తన కుటుంబ సభ్యులను వెంటబెట్టుకుని తిరుమలలోని వివాహం జరిగే కళ్యాణమండపానికి చేరుకుంది. అప్పటికే పెళ్లి పీటలపై కూర్చున్న వరుడు రాకేశ్.. సంధ్యను చూడగానే అక్కడి నుంచి పరారయ్యే ప్రయత్నం చేశాడు. వెంటనే స్పందించిన సంధ్య కుటుంబ సభ్యులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.